Skip to main content

India create World record in Test history: చరిత్ర సృష్టించిన టీమిండియా

వెస్టిండీస్‌తో జరుగుతన్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్‌ ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను మించిపోయింది.
Indian-cricket-team
India create World record in Test history

ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 24 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.​​​​​​​

☛☛ Ashwin breaks Kumble's Record: విండీస్ గ‌డ్డ‌పై అశ్విన్‌ అరుదైన రికార్డు..

శ్రీలంక వరల్డ్‌ రికార్డు బ్రేక్‌:

ఈ క్రమంలో టెస్టుల్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. విండీస్‌తో రెండో టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారత జట్టు  కేవలం 12.2 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2001లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో శ్రీలంక 13.2 ఓవర్లలో వంద పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో శ్రీలంక రికార్డును టీమిండియా బ్రేక్‌ చేసింది.

☛☛ODI WC 2023: వరల్డ్ కప్‌లో భారత్ ఆడ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే...

Published date : 25 Jul 2023 05:45PM

Photo Stories