Skip to main content

Archery: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీలో భారత్‌కు స్వర్ణం

Gwangju 2022 Hyundai Archery World Cup Stage 2: దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ నగరం వేదికగా జరుగుతోన్న ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2–2022లో భాగంగా మే 21న జరిగిన కాంపౌండ్‌ విభాగం మ్యాచ్‌ల్లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి.
Indian men's compound archery team

కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం..
పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగం ఫైనల్లో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 (56–57, 58–58, 60–56, 58–59) పాయింట్ల తేడాతో అడ్రియన్‌ గాంటియర్, జీన్‌ ఫిలిప్‌ బౌల్చ్, క్విన్‌టిన్‌ బారిర్‌లతో కూడిన ఫ్రాన్స్‌ జట్టును ఓడించింది. దీంతో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. 2022, ఏప్రిల్‌లో టర్కీలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలోనూ ఫైనల్లో ఫ్రాన్స్‌పైనే గెలిచి భారత జట్టు బంగారు పతకం సాధించడం విశేషం.

Badminton: థామస్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌ భారత్‌

GK Awards Quiz: 2022 మాల్కం ఆదిశేషయ్య అవార్డు ఎవరికి లభించింది?

కాంస్య పతక పోరులో..
కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పతక పోరులో అభిషేక్‌ వర్మ, అవ్‌నీత్‌ కౌర్‌లతో కూడిన భారత జంట 156–155 (39–39, 38–40, 39–38, 40–38) పాయింట్ల తేడాతో బెరా సుజెర్, ఎమిర్కాన్‌ హనీలతో కూడిన టర్కీ జోడీపై విజయం సాధించి.. కాంస్య పతకం కైవసం చేసుకుంది.

Archery World Cup: ప్రపంచ ఆర్చరీ స్టేజ్‌ 2లో భారత మహిళలకు కాంస్యం

GK Important Dates Quiz: సేవ్ ది ఎలిఫెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు?

వ్యక్తిగత విభాగంలో రజతం..
కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రెండో ప్రపంచకప్‌ టోర్నీ ఆడుతున్న మోహన్‌ రామ్‌స్వరూప్‌ భరద్వాజ్‌ (భారత్‌) రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మోహన్‌ 141–149తో ప్రపంచ నంబర్‌వన్‌ మైక్‌ షోలోసెర్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయాడు.
Women’s Boxing: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణ పతకం

​​​​​​​Junior World Cup: భారత క్రీడాకారిణి రిథమ్‌ సాంగ్వాన్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నీ పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మే 21 
ఎక్కడ    : గ్వాంగ్జూ, దక్షిణ కొరియా
ఎందుకు : ఫైనల్లో అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు 232–230 పాయింట్ల తేడాతో ఫ్రాన్స్‌ జట్టును ఓడించినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 May 2022 01:25PM

Photo Stories