Skip to main content

Badminton: థామస్‌ కప్‌ టీమ్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌ భారత్‌

Telugu Current Affairs - Sports: ప్రతిష్టాత్మక ‘‘థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నమెంట్‌–2022’’లో భారత బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు విజేతగా నిలిచింది.
Indian Badminton team win Thomas Cup 2022 title

మే 15న థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ వేదికగా జరిగిన ఫైనల్లో అంచనాలకు మించి రాణించిన భారత్‌ 3–0తో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాను ఓడించి.. చాంపియన్‌గా అవతరించింది. దీంతో 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ తొలిసారి చాంపియన్‌గా అవతరించినట్లయింది. ఫైనల్‌ చేరిన తొలిసారే భారత్‌ విజేతగా నిలిచింది. ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది.

Limassol International: హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?

Women’s Boxing: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌కు స్వర్ణ పతకం

కేరళకి చెందిన ఎం.ఆర్‌.అర్జున్‌ ఏ క్రీడలో ప్రసిద్ధుడు?
భారత్‌–ఇండోనేసియా మ్యాచ్‌లు ఇలా..

  • తొలి మ్యాచ్‌: ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు.
  • రెండో మ్యాచ్‌: డబుల్స్‌ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్‌ కెవిన్‌ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్‌ మొహమ్మద్‌ అహసాన్‌లను బరిలోకి దించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్‌ జంటను బోల్తా కొట్టించి భారత్‌ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది.
  • మూడో మ్యాచ్‌:  మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథాన్‌ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. 
  • ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు.

GK Science & Technology Quiz: భారతదేశంలో మొట్టమొదటి స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?

గెలుపు వీరుల బృందం...
 ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్‌ కప్‌లో భారత్‌ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (కేరళ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)... ఎం.ఆర్‌.అర్జున్‌ (కేరళ)–ధ్రువ్‌ కపిల (పంజాబ్‌) జోడీలు బరిలోకి దిగాయి.

Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌కప్‌లో స్వర్ణం గెలిచిన భారతీయుడు?​​​​​​​
GK Economy Quiz: 2011, 2019 మధ్య కాలంలో దేశంలో అత్యంత పేదరికం ఎంత శాతం తగ్గింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నమెంట్‌–2022లో విజేతగా నిలిచిన జట్టు?
ఎప్పుడు : మే 20
ఎవరు    : భారత బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు
ఎక్కడ    : బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
ఎందుకు : ఫైనల్లో భారత జట్టు 3–0తో ఇండోనేసియాపై విజయం సాధించినందున..

Asia Cup Archery 2022: ఆసియా కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జోడీ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 May 2022 07:03PM

Photo Stories