Skip to main content

Limassol International: హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?

Jyoti Yarraji

సైప్రస్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌–2022(లిమాసోల్‌ ఇంటర్నేషనల్‌)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ స్వర్ణ పతకం సాధించింది. మే 10న సైప్రస్‌లోని లిమాసోల్‌ వేదికగా జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 13.38 సెకన్లతో అనురాధా బిస్వాల్‌ (ఒడిశా) పేరిట 20 ఏళ్లుగా ఉన్న జాతీయ రికార్డును జ్యోతి బద్దలు కొట్టింది.

GK International Quiz: ప్రపంచంలో తొలి బిట్‌కాయిన్ నగరాన్ని ఏ దేశం నిర్మించాలని యోచిస్తోంది?

షేక్‌ జాఫ్రీన్, భవాని జోడీలకు పతకాలు ఖాయం
బ్రెజిల్‌లోని కాక్సియాస్‌ దో సుల్‌(Caxias do Sul) వేదికగా జరుగుతోన్న బధిరుల ఒలింపిక్స్‌–2022 క్రీడల్లో టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో షేక్‌ జాఫ్రీన్‌ (ఆంధ్రప్రదేశ్‌), భవాని కేడియా (తెలంగాణ) తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో షేక్‌ జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ (భారత్‌) జంట 6–1, 6–1తో టుటెమ్‌– ఎమిర్‌ (టర్కీ) జోడీపై నెగ్గగా... భవాని–ధనంజయ్‌ దూబే (భారత్‌) జోడీకి జర్మనీ జంట నుంచి ‘వాకోవర్‌’ లభించింది.Asia Cup Archery 2022: ఆసియా కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించిన జోడీ?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
100 మీటర్ల హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?
ఎప్పుడు : మే 10
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యెర్రాజీ స్వర్ణ
ఎక్కడ    : లిమాసోల్, సైప్రస్‌
ఎందుకు : సైప్రస్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌–2022(లిమాసోల్‌ ఇంటర్నేషనల్‌)లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో.. జ్యోతి 13.23 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 May 2022 02:11PM

Photo Stories