Asian Games 2023 Boxing: బాక్సింగ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు
Sakshi Education
ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్‌లో మంగళవారం భారత్‌కు రెండు కాంస్య పతకాలు లభించాయి.
Asian Games 2023 Boxing
మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్‌లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. ప్రీతి 0–5తో చాంగ్ యువాన్ (చైనా) చేతిలో... నరేందర్ 0–5తో కున్‌కబయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు.