Skip to main content

Gulveer Singh: 5000 మీటర్లలో గుల్‌వీర్‌ కొత్త జాతీయ రికార్డు

భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ పురుషుల 5000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు.
Gulveer Singh Eclipses 5,000m National Record In Portland Meet  Gulveer Singh setting a new national record in the 5000m

అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌ హై పెర్ఫార్మెన్స్‌ మీట్‌లో గుల్‌వీర్‌ ఈ ఘనత సాధించాడు. 

ఈ మీట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల గుల్‌వీర్‌ 5000 మీటర్లను 13 నిమిషాల 18.92 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అవినాశ్‌ సాబ్లే (13ని:19.30 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం 10,000 మీటర్ల లోనూ జాతీయ రికార్డు గుల్‌వీర్‌ పేరిటే ఉంది.

Wrestler Aman: రెజ్లర్‌ అమన్ సెహ్రావత్‌కు రజతం

Published date : 12 Jun 2024 01:46PM

Photo Stories