FIFA World Cup 2022:అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా ప్రపంచకప్
హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారం¿ోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్‌లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. డిసెంబర్ 18న ఈ టోర్నీ ముగియనుంది.
➤ ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?
92 సంవత్సరాల ఫుట్‌బాల్ ప్రపంచకప్
చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ నవంబర్ 20న ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది.
ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్పటి వరకు విజేతలుగా నిలిచిన జట్లు ఇవే..
అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోరీ్నకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్‌తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్‌కు మూడు పాయింట్లు లభించాయి.