CNG Bike Launch : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్.. విడుదల చేసిన ఆటో బజాజ్..!
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్‌ను ప్రముఖ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇప్పటికే త్రీ వీలర్ విభాగంలో సత్తా చాటుకున్న బజాజ్ ఆటో.. తాజాగా తన టూ- వీలర్ వ్యాపారంలో సంచలనం సృష్టించే దిశగా అడుగులు వేసి ముందుకొచ్చింది. అలా, గతనెలలో బజాజ్ ఆటో సంస్థ ఈ బైక్‌ను విడుదల చేసింది.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. సీఎన్‌జీతోపాటు పెట్రోల్‌తో కూడా నడిచే విధంగా ట్విన్ ట్యాంక్‌ను అమర్చారు. పెరిగిన పెట్రోల్ దరల నుంచి వాహనదారులకు ఈ బైక్ ఊరటనిస్తుందని బజాజ్ ఆటో తెలిపింది.
విడుదల కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఎండీ మాట్లాడుతూ.. పర్యావరణ పరంగా సంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే సీఎన్‌జీ కారణంగా 50- 65 శాతం మేర ఉద్గార స్థాయిలు తగ్గుతాయి. అలాగే, సంప్రదాయ ఇంధన బైక్స్‌తో పోలిస్తే కార్బన డై ఆక్సైడ్ విడుదల 50 శాతం, కార్బన్ మోనాక్సైడ్ 75 శాతంతోపాటు నాన్ మీథేన్ హైడ్రోకార్బన్స్ విడుదల దాదాపు 90 శాతం మేర తగ్గుతాయన్నారు. అంతే కాకుండా, సీఎన్‌జీ బైక తో ఇంధన, నిర్వహణ ఖరచులు సంప్రదాయ ఇంధన మోటార్ సైకిల్ తో పోలిస్తే భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు బజాజ్ కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్.
UK Election Result: బ్రిటన్ ఎన్నికల్లో.. రికార్డు స్థాయిలో ఇండియన్ల గెలుపు!