Australian Researchers : పుట్టుకతో వచ్చే లోపాలపై ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనం
Sakshi Education
పుట్టుకతో వచ్చే లోపాల గుట్టు తేల్చేందుకు గానూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక అధ్యయనాన్ని చేపట్టారు. పిండం ఏర్పడుతుండటాన్ని వీడియోగా చిత్రీకరించారు. ఇందుకు గానూ వెలుగులో రంగు మారే లైఫ్‌యాక్ట్ అనే ఫ్లోరొసెంట్ ప్రొటీన్ పదార్థాన్ని వినియోగించారు.
మనుషుల్లో వందలో 3 శాతం మందికి పుట్టుకతో లోపాలు ఉంటాయని, ప్రధానంగా గుండె, న్యూరల్ ట్యూబ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పిండం ఏర్పడుతున్నప్పుడే ఈ లోపాలను గుర్తించి, చికిత్స అందించేందుకు గానూ ఈ అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు.
CNG Bike Launch : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్.. విడుదల చేసిన ఆటో బజాజ్..!
Published date : 09 Jul 2024 02:28PM