Mini Brain Development : 3డీ మ్యాపింగ్‌తో మినీ బ్రెయిన్ అభివృద్ధి.. దీని పేరు!
Sakshi Education
వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూలకణాలను 3డీ మ్యాపింగ్‌తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్‌ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు. దీన్ని ‘కీమెరాయిడ్’గా పిలుస్తున్నారు. మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో.. ఈ కీమెరాయిడ్ కూడా అలాగే పనిచేస్తుందని పరిశోధకులు అన్నారు. భిన్నమైన వ్యక్తుల నుంచి మూలకణాలను తీసుకోవడంతో ఈ మినీ బ్రెయిన్ ఆయా వ్యక్తుల మెదడులా కాకుండా.. కొత్తగా ఆలోచిస్తుందని పేర్కొన్నారు. మెదడుపై డ్రగ్స్ పనితీరు తెలుసుకోవడానికి దీన్ని వినియోగిస్తామన్నారు.
Published date : 09 Jul 2024 02:30PM