Skip to main content

ICC World Cup Schedule 2023 : ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్ ఇదే..! ఈ సారి మాత్రం..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల‌కు త్వ‌ర‌లోనే పండ‌గ వాతావ‌ర‌ణం రానునుంది. ఇటీవ‌లే ఐపీఎల్ ముగిసిన విష‌యం తెల్సిందే. తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
World Cup Schedule 2023 Details in Telugu
World Cup Schedule 2023

జూన్ 27వ తేదీన‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 

➤☛ Virat Kohli Records : ప్రపంచ క్రికెట్‌లో చ‌రిత్ర‌లో ఏకైక ఆటగాడిగా కోహ్లి.. సాధించిన అరుదైన రికార్డులు ఇవే..

వరల్డ్‌కప్‌ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్‌ 5కు జూన్‌ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్‌ సేథి ప్రకటన చేశాడు.

Virat Kohli Top Records : కోహ్లి కెరీర్‌లో ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఇవే.. ఎందుకంటే..?

నరేంద్ర మోదీ స్టేడియంలో.. 

world cup 2023

భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్‌ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే.

➤☛ IPL 2023: 16 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో అరుదైన రికార్డు...

Published date : 22 Jun 2023 05:26PM

Photo Stories