Skip to main content

Norway Chess 2024: ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ప్రజ్ఞానంద.. మూడో ర్యాంకర్‌పై వైశాలి సంచలన విజయాలు

నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరుగుతున్నచెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు, తోబుట్టువులు ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
Brother-sister Indian duo of Praggnanandhaa and Vaishali suffer defeats at Norway Chess tournament

ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ను ఓడించారు. 

ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్‌ గేమ్‌ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిర్వహించారు. 

T20I Batsmen Rankings: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. టాప్‌-5లో ఉన్న‌ది వీరే..

ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా), భారత స్టార్‌ కోనేరు హంపి మధ్య క్లాసికల్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిర్వహించగా జు వెన్‌జున్‌ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది.

Published date : 04 Jun 2024 11:38AM

Photo Stories