Taiwan unveils first submarine: స్వదేశీ జలాంతర్గామిని తయారుచేసిన తైవాన్
ప్రస్తుతం ఈ సబ్‌మెరైన్ పరీక్ష దశలో ఉంది. పరీక్షల్లో విజయవంతమై తైవాన్ అమ్ములపొదిలో చేరితే ఆ దేశ సైనిక స్థైర్యం మరింత ఇనుమడించనుంది. ‘గతంలో దేశీయంగా జలాంతర్గాముల తయారీ అనేది అసాధ్యం. కానీ ఈరోజు స్వదేశీ జలాంతర్గామి మీ కళ్ల ముందు ఉంది’ అని నౌకాతయారీకేంద్రంలో నూతన జలాంతర్గామి ఆవిష్కరణ కార్యక్రమంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్–వెన్ వ్యాఖ్యానించారు.
Scientists Discover 8th Continent: ఎనిమిదవ ఖండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
‘ దేశ పరిరక్షణకు ప్రతినబూనిన మా సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం ఈ సబ్‌మెరైన్. వ్యూహాలు, యుద్ధతంత్రాల్లో నావికాదళం సన్నద్థతలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది’ అని ఆమె అన్నారు. కొత్త జలాంతర్గామికి హైకున్ అని పేరుపెట్టారు. చైనా ప్రాచీనగాథల్లో హైకు అంటే అది్వతీయమైన శక్తులు గలది అని అర్ధం. హార్బర్, సముద్ర పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక నావికాదళానికి అప్పగిస్తారు. 2027 ఏడాదికల్లా రెండు సబ్‌మెరైన్‌లను నిర్మించి దళాలకు ఇవ్వాలని తైవాన్ యోచిస్తోంది.