Skip to main content

Scientists Discover 8th Continent: ఎనిమిదవ ఖండాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

ఇప్పటి వరకు ఏడు ఖండాలున్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఖండాలు ఎనిమిది అని చెప్పక తప్పదేమో!.
Scientists Discover 8th Continent,Zealandia,Zealandia Discovery,Campbell Plateau
Scientists Discover 8th Continent

ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందట. తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్‌ జర్నల్‌లో వెల్లడించారు. 
ఈ కొత్త ఖండాన్ని దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందని తెలిపారు. దీని పేరు జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ జిలాండియా అనే ఎనిమిదవ ఖండం దాదాపు 1.89 మిలియన్‌ చదరపు మైళ్ల(4.9 మిలియన్‌ చదరపు కి.మీ) విస్తీరణంలో విశాలంగా ఉందని వెల్లడించారు. ఇది మడగాస్కర్‌ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు. ఈ కనుగొన్న కొత్త ఖండంతో కలిపి ప్రస్తుతం మనకు ఎనిమిది ఖండాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.

World Talent Ranking 2023: టాలెంట్ ర్యాంకింగ్‌లో 56 స్థానానికి చేరిన భార‌త్‌

ఇది చూడటానికి సన్నగా అతి పిన్న వయస్కురాలైన ఖండంగా రికార్డు నెలకొల్పిందన్నారు. అలాగే ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరం అన్నారు. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి..సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోందన్నారు.

World University Rankings: వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో.. భారత్‌వే 91!

ఇది న్యూజిలాండ్‌ పశ్చిమతీరంలో క్యాంప్‌బెల్‌ పీఠభూమి సమీపంలోని ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్‌ ఖండమైన గోండ్వానాలో భాగం అని చెబుతున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇది సుమారు 550 మిలియన్‌ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Global Innovation Index 2023: 40 స్థానంలో భారత్‌

Published date : 29 Sep 2023 08:58AM

Photo Stories