New E-passports In India: ఇకపై ఈ-పాస్‌పోర్ట్‌లు
పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లను ఏడాది చివరి నాటికి ప్రవేశపెట్టడం ద్వారా గణనీయమైన డిజిటల్ మార్పునకు నాంది పలికేందుకు భారత్ సిద్ధమైంది. కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
Sky Bus: స్కై బస్సు సర్వీస్ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?
ఇంటిగ్రేటెడ్ చిప్
కొత్త ఈ-పాస్‌పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్‌తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్‌పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
దీనికి సంబంధించి గత జూన్‌లో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి అనుగుణంగా 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని మెరుగుపరిచే లక్ష్యంతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొంది.
ఈజ్ (EASE)ని విపులీకరిస్తే.. E అంటే డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి పౌరులకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలు అందించడం, A అంటే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవా డెలివరీ, S అంటే చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి సులభతరమైన విదేశీ ప్రయాణం, E అంటే మెరుగుపరచబడిన డేటా భద్రత.
ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' లక్ష్యంలో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం గణనీయమైన పాత్ర పోషిస్తోందని జైశంకర్ అన్నారు. ఇందులో భాగంగానే mPassport పోలీస్ యాప్, mPassport సేవా మొబైల్ యాప్, డిజీలాకర్ (DigiLocker)తో పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమాన్ని అనుసంధానించడం వంటి మైలురాళ్లు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.
India's First Private Rocket Vikram-1: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1
మొదట ఫిన్లాండ్‌లో..
అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్‌పోర్ట్‌లను ప్రారంభించిన మొదటి దేశంగా ఫిన్లాండ్ అవతరించింది. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్‌పోర్ట్‌లకు బదులుగా ఈ-పాస్‌పోర్ట్‌లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది.
Gaganyaan Mission: గగన్‌యాన్‌లో మహిళా పైలట్లు, శాస్త్రవేత్తలకే ప్రాధాన్యం