Skip to main content

Gaganyaan Mission: గగన్‌యాన్‌లో మహిళా పైలట్లు, శాస్త్రవేత్తలకే ప్రాధాన్యం

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు.
Women astronauts to lead India's space exploration, Diversity and equality in ISRO's manned space program, ISRO Chairman S. Somnath announces women's priority in Gaganyaan mission, ISRO chief Somnath says space agency prefers woman pilots for Gaganyaan Mission
ISRO chief Somnath says space agency prefers woman pilots for Gaganyaan Mission

వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్‌ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని  తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది  మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు.

Gaganyaan Mission: ఇస్రో ‘గగన్‌యాన్‌’ TV-D1 ప్రయోగం విజయవంతం

ప్రస్తుతానికి మహిళా ఫైటర్‌ టెస్ట్‌ పైలట్లు దొరకనందున ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ టెస్ట్‌ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్‌ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 

ISRO TV-D1: గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1

Published date : 24 Oct 2023 01:23PM

Photo Stories