Skip to main content

New Variant XE Alert: ఒమిక్రాన్‌ కంటే ఫాస్టెస్ట్‌ మ్యూటెంట్‌.. దీని ల‌క్ష‌ణాలు ఇవే..

ఒక వేవ్‌ ముగిసిందని, ఒక వేరియెంట్‌ ప్రభావం తగ్గిపోయిందని అనుకునేలోపు.. కొత్త వేరియెంట్‌, మ్యూటెంట్‌ తెర మీదకు వస్తోంది. తాజాగా కొత్తగా బయట పడిన కరోనా మ్యూటెంట్ పేరు చెప్పేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ‘ఎక్స్ఈ’ గా పిలిచే ఈ కరోనా మ్యూటెంట్‌ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
World Health Organization
World Health Organization

ఇప్పటి వరకు..
కొవిడ్‌-19 ఎక్స్‌ఈ Covid-19 XE.. మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియెంట్‌లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా భావిస్తున్నారు. అయితే.. స్టెల్త్‌ కరోనాతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో వ్యాపించే గుణం ఉందని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. 

Omicron: మనిషి చర్మంపై ఒమిక్రాన్‌ ఎన్ని గంటలు బతికుంటుందో ఉంటుందో తెలుసా..?

ఎక్స్ఈ కేసులు..
ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. కానీ, ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలగలిసిన రూపం. ఇదిలా ఉంటే.. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు. ప్రస్తుతానికి ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయట. అయితే ముందు ముందు పరిస్థితిని అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. 

Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?

ఇందులోనూ..
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. మూడు రకాల రీకాంబినెంట్ స్ట్రెయిన్లు ఎక్స్ డీ, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. గతంలో వెలుగు చూసిన రెండు ఉప రకాలతో కలసిన స్వరూపాన్ని రీకాంబినెంట్ గా చెబుతారు. ఇందులో ఎక్స్ డీ అన్నది.. డెల్టా, బీఏ.1 కలసిన రకం. ఎక్స్ఎఫ్ అన్నది డెల్టా, బీఏ.1 కలసిన మరొక రూపం.

New Virus in China:మళ్లీ కొత్త వైరస్‌? ..అసలు సంగతి ఇదే.. ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..

​​​​​​​New variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. ల‌క్ష‌ణాలు ఇవే..

Good News : ఏడాది చివరికి కరోనా అంతం..! డబ‍్ల్యూహెచ్ఓ కీల‌క ప్రకటన..

Published date : 02 Apr 2022 04:22PM

Photo Stories