Skip to main content

New variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. ల‌క్ష‌ణాలు ఇవే..

కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
new variant in israel
new variant in israel

మార్చి 16వ తేదీన‌ ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్‌ పరీక్ష చేయగా కరోనా కొత్త వేరియంట్‌ బయటపడినట్లు ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ల‌క్ష‌ణాలు ఇవే..
ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్‌ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్‌ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ రెండు స్ట్రెయిన్‌లు కలిగిన కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉ‍న్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్‌ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా​ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ వ్యాప్తి, కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్‌ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ మూడు డోసులు పొందినట్లు సల్మాన్‌ జర్కా వెల్లడించారు.

ఊపిరి పీల్చుకుంటున్న స‌మ‌యంలోనే..
ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల లాక్‌డౌన్‌లు విధించారు. ఒక్క చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్‌  వెలుగు చూశాక వుహాన్‌ లాక్‌డౌన్‌ తర్వాత.. ఈ రేంజ్‌లో భారీగా లాక్‌ డౌన్‌ విధించడం ఇదే కావడం గమనార్హం. ఈ సిటీలో ప్రస్తుతం లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాలన్నీ చైనా అధికారిక మీడియా సంస్థ కూడా ధృవీకరించింది.

అసలు విషయం ఇదే.. 
ఈ తరుణంలో ప్రస్తుతం విజృంభిస్తోంది కరోనా వైరస్సేనని, అందులో శరవేగంగా వ్యాపించిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులేనని స్పష్టత ఇచ్చాయి ఇండిపెండెంట్‌ మీడియా హౌజ్‌లు. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించారట. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదుకాగా, చాంగ్‌చున్‌లో దాదాపు నాలుగు వందల కేసులు, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. బయటి ప్రపంచానికి తెలిసి.. సుమారు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో.. అత్యధికంగా న్యూజిలాండ్‌ తొలిస్థానంలో ఉంది. చైనాలో మాత్రం 1,369 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలావరకు ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయి. దీంతో ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో..

ఈ స‌మ‌యంలోనే..
చైనాలో కొత్త వైరస్‌, వేరియెంట్‌ వార్త‌లతో ఆందోళ‌న‌కు గురయ్యాయి. అయితే చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్‌ వేరియెంట్‌ అని, ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు ఊరట ఇస్తున్నారు. భారత్‌లో మరో వేవ్‌ కష్టమేనని, అయినా అప్రమత్తంగా ఉండడం మంచిదన్న సంకేతాలు ఇటీవలె వైద్య నిపుణులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. 

ప్రపంచం నివ్వెరపోయిందిలా..
గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్‌ డాంగ్, జిలిన్, షాన్‌ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వింటర్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్‌ టోలరెన్స్‌ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వింటర్‌ ఒలింపిక్స్‌ ఈవెంట్స్‌ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట‌. దీంతో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా అధికారులు ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు. ఇది అసలు సంగతి.

Published date : 16 Mar 2022 09:36PM

Photo Stories