Skip to main content

Heavy Weight Torpedo: భారత నేవీ టార్పెడో పరీక్ష విజయవంతం

దేశీయంగా అభివృద్ధి చేసిన భారీ టార్పెడోను నావికా దళం జూన్ 6న‌ పరీక్షించింది. భారత నేవీ, భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్‌డీవో) చరిత్రలో ఇదో మైలురాయిగా నేవీ అభివర్ణించింది.
Heavy Weight Torpedo

‘నీటి అడుగున ఉండే లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగల ఆయుధాల కోసం నేవీ, డీఆర్‌డీవో సాగిస్తున్న అన్వేషణలో ఇదో కీలక మైలురాయి. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన హెవీ వెయిట్‌ టార్పిడోతో నీటిలోని లక్ష్యాన్ని ధ్వంసం చేశాం. ఆత్మనిర్భరతలో భాగంగా భవిష్యత్తులో మా పోరాట సంసిద్ధతకు ఇది నిదర్శనం’ అని నేవీ తెలిపింది. హిందూ మహా సముద్రంలో చైనా కారణంగా ముప్పు పెరుగుతున్న వేళ నేవీ ఈ ప్రయోగం చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే భారత నౌకాదళానికి వరుణాస్త్ర అనే అధిక బరువు గల టార్పిడో ఉంది. ఇది స్వయం చోదిత, నీటి అడుగు నుంచి ప్రయోగించే క్షిపణి. 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు జలాంతర్గామి నుంచి శత్రునౌకల పైకి దీన్ని ప్రయోగిస్తారు. దీన్ని విశాఖపట్నంలోని ఎన్‌టీఎస్ఎల్ (నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ) అభివృద్ధి చేసింది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (07-13 మే 2023)
 

Published date : 07 Jun 2023 03:52PM

Photo Stories