Skip to main content

Agni-IV Missile: అగ్ని–4 పరీక్ష విజయవంతం

India successfully tests nuclear capable Agni 4 ballistic missile
India successfully tests nuclear capable Agni 4 ballistic missile

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–4ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌కలాం దీవి నుంచి ఈ అస్త్రాన్ని పరీక్షించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలను, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని చెప్పారు. ఈ అస్త్రం టన్ను పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

Missile Test: జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణి పరీక్ష

Published date : 16 Jun 2022 04:52PM

Photo Stories