Missile Test: జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి పరీక్ష
Sakshi Education
Missile Test: జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి పరీక్షను నిర్వహించిన దేశం?
Russia test-fires Zircon hypersonic missile
ఉక్రెయిన్ పై దాడులను ముమ్మరం చేసిన నేపథ్యంలో.. రష్యా తన ఆయుధ పాటవాన్ని ప్రదర్శించింది. ధ్వని వేగం కన్నా 9 రెట్లు(గంటకు 11వేల కిలోమీటర్లు) వేగంగా దూసుకెళ్లే శక్తిమంతమైన జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిని తాజాగా పరీక్షించింది. బేరంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్ష్‌ఖోవ్ యుద్ధనౌక నుంచి జిర్కాన్ ను రష్యా ప్రయోగించింది. ఇది వెయ్యి కిలోమీటర్ల దూరంలోని వైట్ సీలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.