Nomura: రక్షణ ఉత్పత్తుల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు
ఈ నివేదిక ప్రకారం.. రక్షణ ఉత్పత్తుల తయారీలో భారతదేశానికి బంగారు భవిష్యత్తు ఉంది.
➣ భారత్ 2032 నాటికి 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగలదని అంచనా.
➣ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీలు, సర్వీసులకు డిమాండ్ పెరుగుతోంది.
➣ రక్షణ రంగంలో భారతదేశం 2029-30 నాటికి రూ.15.5 లక్షల కోట్లను వెచ్చించనుంది.
➣ 'సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం' రూపంలో భారత ప్రభుత్వం రక్షణ రంగానికి పూర్తి మద్దతు ఇస్తోంది.
ఈ కంపెనీలకు అవకాశాలు..
➣ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో గొప్ప అవకాశాలు ఉన్నాయి.
➣ రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు బలమైన ఆర్డర్లు రావచ్చు.
➣ రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల ద్వారా తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోవచ్చు.
NASA Hires SpaceX: ఐఎస్‌ఎస్‌ను కూల్చేయనున్న స్పేస్‌ఎక్స్!
లాభదాయక విభాగాలు..
➣ డిఫెన్స్ ఏరోస్పేస్ (విలువ: 50 బిలియన్ డాలర్లు): ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థలు.
➣ షిప్ బిల్డింగ్ (విలువ: 38 బిలియన్ డాలర్లు): నేవల్ వెస్సెల్స్, సబ్‌మెరైన్‌లు, పెట్రోల్ బోట్లు.
➣ మిసైళ్లు, ఆర్టిలరీ గన్ వ్యవస్థలు (విలువ: బిలియన్ డాలర్లు).