Tejas Aircraft: భారత వాయుసేన అమ్ముల పొదిలో తేజస్
Sakshi Education
భారత వాయుసేన అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది.
బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. భారత వాయుసేనలో శిక్షణ ఇవ్వడానికి తేజస్ అన్ని రకాల సామర్థ్యాలు కలిగి ఉందని, అవసరమైతే యుద్ధ రంగంలో కూడా సేవలు అందిస్తుందని హాల్ వెల్లడించింది.
తక్కువ బరువు కలిగి ఉండి అన్ని రకాల వాతావరణాలను తట్టుకోగలిగిన 4.5 జనరేషన్‌కు చెందిన యుద్ధ విమానం తేజస్. రెండు సీట్లు ఉండేలా డిజైన్ చేయడం వల్ల అప్పుడే వాయుసేనలో అడుగు పెట్టిన పైలెట్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.
C-295 Aircraft inducted into Air Force: ఐఏఎఫ్‌లోకి సీ–295 రవాణా విమానం
Published date : 06 Oct 2023 01:21PM