Google Gemini: గూగుల్ అడ్వాన్స్‌డ్ ఏఐ మోడల్ 'గూగుల్ జెమిని'
గూగుల్ జెమిని అనేది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలుస్తోంది. ఇది డేటా సెంటర్లలో, కార్పొరేట్ అవసరాలకు మాత్రమే కాకుండా మొబైల్ డివైజ్‌లలో కూడా పనిచేస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) వెల్లడించారు.
ISRO Missions 2024: లో కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
గూగుల్ జెమిని ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌసర్ వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
వేరియంట్స్
గూగుల్ జెమిని మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జెమిని నానో, జెమిని ప్రో, జెమిని అల్ట్రా వేరియంట్లు.
జెమిని నానో
జెమిని నానో అనేది మొబైల్ డివైజ్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ టెక్నాలజీ. ఇది గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌కు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 4 వెర్షన్‌లో కూడా పనిచేస్తుంది. జెమిని నానో డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చాట్, మెసేజింగ్ యూప్‌లు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
SpaceX 250 Rocket: స్పేస్ ఎక్స్ రాకెట్ సేఫ్ ల్యాండ్
జెమిని ప్రో
గూగుల్ బార్డ్ ఏఐకు జెమిని ప్రో అనేది అడ్వాన్స్‌డ్ వె ర్షన్. ఇది వేగవంతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఇది కూడా డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.
జెమినీ అల్ట్రా
గూగుల్ కొత్త ఏఐ టెక్నాలజీలో జెమిని అల్ట్రా అనేది శక్తివంతమైన వెర్షన్. ఇది కార్పొరేట్ సంస్థల అవసరాలకు కూడా ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. పైథాన్, జావా వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను అర్థం చేసుకుని కావలసిన రిజల్ట్ అందిస్తుంది. ఇది 2024 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
గూగుల్ జెమిని స్పెషాలిటీ
గూగుల్ జెమిని కేవలం కమర్షియల వినియోగాలకు మాత్రమే కాకుండా.. విద్యార్థులు హోంవర్క్ విషయంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోంవర్క్‌ను ఫోటో తీసి జెమిని ఏఐలో అప్లోడ్ చేస్తే ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా గూగుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Aditya-L1 Mission: సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్న ఆదిత్య ఎల్–1