Chandrayaan-3 Launch Date: చంద్రయాన్–3 లాంచ్ ఎప్పుడంటే..
Sakshi Education
చంద్రయాన్–3ని జూలై 13న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ–ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుడిపైకి పంపనున్నారు.
చంద్రయాన్-3 చంద్రయాన్-2కి ఫాలో-ఆన్ మిషన్. ఈ మిషన్ ద్వారా చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను ల్యాండింగ్ చేయనుంది. ఈ మిషన్‌కు బడ్జెట్‌లో రూ.615 కోట్లు కేటాయించారు.
ఉపగ్రహం సుమారు 3,84,000 కి.మీ. ప్రయాణించి ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్‌ను 100 కి.మీ చంద్ర కక్ష్య వరకు తీసుకువెళుతుంది. తర్వాత జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది.
ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్ర కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయడానికి స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (SHAPE) పేలోడ్‌ను కలిగి ఉంది.
☛ Daily Current Affairs in Telugu: 5 జులై 2023 కరెంట్ అఫైర్స్
Published date : 06 Jul 2023 01:22PM