Daily Current Affairs in Telugu: 5 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరంలోని అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించారు
2. ఆదివాసీల 75 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ములుగు జిల్లా మండపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యంగంలోని ఐదో షెడ్యూల్ కిందకే వస్తాయని తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
3. శ్రామిక శక్తి 2021– 22 నివేదిక ప్రకారం కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు.
4. వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బయోటెక్నాలజీ విధానంలో కొత్త వరి వంగడం ‘వరంగల్ - 1487’ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
☛ Daily Current Affairs in Telugu: 1 జులై 2023 కరెంట్ అఫైర్స్
5. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బెర్గ్(నార్వే మాజీ ప్రధాని) పదవీ కాలాన్ని 2024 అక్టోబరు 1 వరకు పొడిగించాలని 31 సభ్య దేశాలు నిర్ణయించాయి.
6. జపాన్ అణు కర్మాగారానికి సంబంధించిన శుద్ధి చేసిన రేడియోధార్మిక వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేందుకు ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అనుమతించింది.
7. దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో తొమ్మిదోసారి భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.
8. భారత చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కర్ణాటకకు చెందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ గౌరవ డాక్టరేట్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు.
9. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలకు సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ₹2,00,000/- వరకు రుణాలు పొందేందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 'స్వర్ణిమ పథకం' ప్రవేశ పెట్టింది.
10. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన మైనర్ బాలికలకు వైద్య, ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని ప్రారంభించింది