Daily Current Affairs in Telugu: 1 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ)గా ఎయిర్ కమాండర్ వి.ఎం.రెడ్డి నియమితులయ్యారు.
2. తుషార్ మెహతాను భారత సొలిసిటర్ జనరల్‌గా మూడోసారి నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
3. యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కృపాణ్‌ను వియత్నాంకు కానుకగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.
4. ట్విట్టర్‌కు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ కర్ణాటక హైకోర్టు జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
5. అమెరికాలోని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ‘గెలాక్టిక్ 01' పేరిట చేపట్టిన తొలి అంతరిక్ష వాణిజ్య యాత్ర విజయవంతమైంది.
☛ Daily Current Affairs in Telugu: 30 జూన్ 2023 కరెంట్ అఫైర్స్
6. ఆసియా స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన దీపిక పల్లికల్ – హరీందర్‌పాల్ సింగ్ సంధు జోడి విజేతగా నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
7. వార్షిక యూకే-భారత్ అవార్డుల్లో భాగంగా మేరీకోమ్‌కు 2023 గ్లోబల్ ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించంది.
8. నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే - July 1
9. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో జరిగిన ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ 2023లో ఇరాన్‌పై గెలిచి భారత్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
10. ఇ-కామర్స్ ఎగుమతులను సులభతరం చేయడానికి రెండు దేశాల మధ్య అంతర్జాతీయ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ఐటిపిఎస్)ని ప్రవేశపెట్టడానికి కెనడా పోస్ట్‌తో ఇండియా పోస్ట్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
☛ Daily Current Affairs in Telugu: 29 జూన్ 2023 కరెంట్ అఫైర్స్