Skip to main content

Daily Current Affairs in Telugu: 29 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
Daily Current Affairs
Daily Current Affairs in Telugu

1. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జగనన్న అమ్మఒడి నాలుగో సంవత్సరానికి సంబంధించి 42,61,965 మందికి రూ.6,392.94 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌  బటన్‌ నొక్కి విడుదల చేశారు.

2. ఇంధన పరివర్తన(ఎనర్జీ ట్రాన్సిషన్‌) ఇండెక్స్ 2023లో  120 దేశాలకు గాను భారత్‌ 67వ ర్యాంకులో నిలిచినట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌(డబ్ల్యూఈఎఫ్‌) నివేదిక పేర్కొంది. గ్లోబల్‌ ర్యాంకింగ్స్‌ జాబితాలో స్వీడన్‌ తొలి స్థానాన్ని పొందగా, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌ టాప్‌–5లో చోటు సాధించాయి. 

☛ Daily Current Affairs in Telugu: 28 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

3. సీబీఐ స్పెషల్‌ డైరెక్టరుగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అజయ్‌ భట్నాగర్‌ నియమితులయ్యారు.

4. భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2026–27 ఆర్థిక సంవత్సరం వరకూ సగటున 6.7 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ సీనియర్‌ ఎకనమిస్ట్‌ (ఆసియా–పసిఫిక్‌) విశ్రుత్‌ రాణా అంచనావేశారు.

☛ Daily Current Affairs in Telugu: 27 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

5. దేశంలో పరిశోధన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) బిల్లు 2023ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

6. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డిఆర్‌డిఒ) డిఫెన్స్ రీసెర్చ్, డెవ‌లెప్‌మెంట్ ని ప్రోత్సహించే లక్ష్యంతో ‘అనుసంధాన్ చింతన్ శివిర్’ని జూన్ 27న న్యూఢిల్లీలో నిర్వహించింది.

7. విటాస్టా అనే పండుగ‌ను కాశ్మీర్ లో june 23-25 వ‌ర‌కు జ‌రుపుకున్నారు.

8."వెటరన్ క‌ళాకారుల‌కు ఆర్థిక సహాయం" అనే ప‌థ‌కం క్రింద ప్రముఖ కళాకారులకు ఆర్థిక సహాయం అందించడం కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కెనరా బ్యాంక్ మధ్య అవగాహన ఒప్పందం (MOU) జ‌రిగింది.

9. అంతర్జాతీయ ట్రోపిక్స్ దినోత్స‌వం - June 29.

10. జాతీయ గణాంకాల(స్టాటిస్టిక్స్‌) దినోత్సవం - June 29.

 Daily Current Affairs in Telugu: 26 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

Published date : 29 Jun 2023 03:29PM

Photo Stories