Skip to main content

Daily Current Affairs in Telugu: 28 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu
  • కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) లబ్ధిదారులకు దేశంలోని మూడు ప్రధాన వైద్యసంస్థల్లో సర్వీసులో ఉన్నవారికి, పెన్షనర్లకు సిఫార్సులతో పనిలేకుండా దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌  సైన్సెస్‌ (ఎయిమ్స్‌), చండీగఢ్‌లోని పోస్ట్‌-గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌  రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌), పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌)లలో నగదు రహిత చికిత్స అందించేలా కేంద్రం నిర్ణయం తీసుకొంది.
  • ఐక్యరాజ్యసమితి అంతరిక్ష వ్యవహారాల కార్యాలయం (యూఎన్‌ఓఓఎస్‌ఏ) డైరెక్టర్‌గా భారత సంతతికి  చెందిన బ్రిటన్‌ మహిళ ఆర్తీ హొల్లా మైనీ నియమితులయ్యారు.
  • ఆర్థిక సంవత్సరం (2022-23) జనవరి- మార్చి త్రైమాసికంలో భారత కరెంటు ఖాతా లోటు 1.3 బిలియన్‌ డాలర్లు  లేదా జీడీపీలో 0.2 శాతానికి తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.
  • అంతర్జాతీయ MSME దినోత్సవం సందర్భంగా సూక్ష్మ, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ మంత్రి నారాయణ్ రాణే  ‘ఛాంపియన్స్ 2.0 పోర్టల్‌ను,మహిళా పారిశ్రామికవేత్తల కోసం 'MSME ఐడియా హ్యాకథాన్ 3.0ను ప్రారంభించారు.  

 Daily Current Affairs in Telugu: 27 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

  • ఆర్టికల్ 44 ప్ర‌కారం భారతదేశ‌ పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలని  భారత రాజ్యాంగంలో పొందుప‌రిచారు.
  • భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ కార్య‌క్ర‌మం-IIలో విశిష్ట సేవలందిస్తున్న, పదవీ విరమణ పొందిన భారతీయ సాయుధ దళాలు, కోస్ట్ గార్డ్ సిబ్బందికి 84 విశిష్ట సేవా అవార్డులను ప్రదానం చేశారు. 
  • మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
  • 2013-14లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కి.మీలు కాగా, 2022-23 నాటికి ఇది 1,45,240 కి.మీలకు చేరిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలిపారు.

 Daily Current Affairs in Telugu: 26 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

Published date : 28 Jun 2023 06:20PM

Photo Stories