Daily Current Affairs in Telugu: 27 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
Sakshi Education
వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధులకు సాక్షి ఎడ్యుకేషన్ అందించే డైలీ కరెంట్ అఫైర్స్
- యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ June 26న తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు.
- రాజధాని అమరావతి సీఆర్‌డీఏ పరిధి(ఆర్5 జోన్)లో 47 వేల ఇళ్ల నిర్మాణానికి దిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (సీఎస్‌ఎంసీ) సమావేశంలో కేంద్రం అనుమతులిచ్చింది.
- దీపావళి పండగను అమెరికాలో( USA) సెలవు దినంగా ఆమోదిస్తూ న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
☛ Daily Current Affairs in Telugu: 26 జూన్ 2023 కరెంట్ అఫైర్స్..
- ప్రత్యేక ఒలంపిక్స్ ప్రపంచ క్రీడల్లో భారత్ 76 స్వర్ణాలు,75 రజితాలు, 51 కాంస్య పతకాలతో మొత్తంగా 222 పతకాలు సాధించింది.
- క్రాప్ మ్యాపింగ్, క్రాప్ స్టేజ్ డిస్క్రిమినేషన్, క్రాప్ హెల్త్ మానిటరింగ్, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అసెస్‌మెంట్‌లపై దృష్టి సారించిన విశ్లేషణ నమూనాలను అభివృద్ధి చేయడానికి వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 'పిక్సెల్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'తో ఒప్పందం చేసుకుంది.
- ఒడిశా ప్రభుత్వం, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పరిశ్రమ సంఘాల సహకారంతో భువనేశ్వర్‌లో ఒడిషా గున్‌వట్ట సంకల్ప్ (ఒడిశా క్వాలిటీ మిషన్)ను ప్రారంభించింది
- అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSME) దినోత్సవం - June 27
☛ Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
Published date : 27 Jun 2023 07:02PM