Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
1. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులరను ‘టోఫెల్’ పరీక్షకు సన్నద్ధం చేయడానికి ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
2. అర్హులను గుర్తించి, పథకాలే కాకుండ వారికి కావలసిన డాక్యుమెంటేషన్లను కూడా అందించే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెల రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది.
Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
3.పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మెప్మా సంస్థకు జాతీయస్థాయి స్పార్క్ (సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్) ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది.
4. భారత నౌకాదళంలో జలాంతర్గాముల కోసం స్వదేశీ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థను రూపొందించడానికి లార్సెన్ & టూబ్రో(L&T), డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేలషన్(DRDO) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు.
5.ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నివసించడానికి అత్యుత్తమ నగరంగా వియన్నా(ఆస్ట్రియా) అగ్రస్థానంలో నిలిచింది.
6. వైయస్సార్ జిల్లాకు చెందిన తక్కెడశిల జాని రచించిన విమర్శన గ్రంథం ‘వివేచని’కి యువ పురస్కారాన్ని, ప్రముఖ రచయిత డీకే చదువులబాబు చిరుకథల పుస్తకం ‘వజ్రాల వాన’కు బాల పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు 2023 ప్రకటించింది.
Daily Current Affairs Short: 22 జూన్ 2023 కరెంట్ అఫైర్స్ ఇవే..