Skip to main content

Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
daily current affairs
daily current affairs

1. ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్‌ క్రాపింగ్‌ (ఈ–క్రాప్‌) సాంకేతికతను ఇథియోపియా దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
2. ఆగస్టు 15 నుంచి మొద‌ల‌వుతున్న‌ డిజిటల్‌ క్రాప్‌ సర్వే (కేంద్ర ప్రాయోజిత పథకం) పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు మ‌రో 11 రాష్ట్రాలను ఎంపిక చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజ తెలిపారు.
3. భారత్‌లో బెంగళూరు, అహ్మదాబాద్‌లలో కొత్త‌గా అమెరికా కాన్సులేట్‌లను ప్రారంభించాలని అమెరికా నిర్ణయించింది. భారత్‌ కొత్త కాన్సులేట్‌ను సియాటెల్‌లో ప్రారంభించాలని భారత్‌ నిర్ణయించింది.
4. ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఫ్‌పీఆర్‌ఐ) ఇటీవల విడుదల చేసిన ‘ది గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్టు’ (జీఎఫ్‌పీఆర్‌) ప్ర‌కారం ప్రపంచవ్యాప్తంగా 2014లో పోషకాహారలోపం ఉన్నవారు 57.20 కోట్లు మంది ఉండగా, 2021 నాటికి ఈ సంఖ్య 76.80 కోట్లకు చేరింది.  పోషకాహారలోప సమస్య అఫ్గానిస్థాన్‌లో 30%, పాకిస్థాన్‌లో 17%, భారత్‌లో 16%, బంగ్లాదేశ్‌లో 12%, నేపాల్‌లో 6%, శ్రీలంకలో 4% ఉందని నివేదిక వెల్లడించింది.

 Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే..

5. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌)లో కొత్త సూపర్‌ కంప్యూటర్‌ ‘పరమ్‌ విక్రమ్‌-1000’ ను ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రారంభించారు.
6. ఫైటర్‌జెట్‌ ఇంజన్లను భారత్‌లో తయారుచేసేందుకు జనరల్‌ ఎలక్ట్రిక్‌(జీఈ) ఏరోస్పేస్, హిందుస్తాన్‌ ఎరోనాటిక్స్‌ (హాల్‌) మధ్య  ఒప్పందం అమెరికాలో జ‌రిగింది.
7. భారత నౌకాదళంలోని ఇంటిగ్రేటెడ్ సిమ్యులేటర్ కాంప్లెక్స్ ‘ధృవ్’ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు.
8. నాగాలాండ్‌లోని డిమాపూర్‌లో యూనిటీ మాల్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ₹145 కోట్లు కేటాయించింది.
9. ఐక్య‌రరాజ్య స‌మితి ప్ర‌జాసేవ దినోత్స‌వం - June 23
10. ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఒలంపిక్ డే - June 23.

 Daily Current Affairs in short : 21 జూన్‌ 2023 కరెంట్‌ అఫైర్స్‌ ఇవే

 

Published date : 26 Jun 2023 04:17PM

Photo Stories