Daily Current Affairs Short: 22 జూన్ 2023 కరెంట్ అఫైర్స్ ఇవే..
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
2. అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భారత ప్రధాని మోడీ వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
3. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీ-2023లో ఐస్‌ల్యాండ్ మొదటి స్థానంలో నిలువగా భారత్ 127వ స్థానంలో నిలిచింది.
☛ IndiGo: ఇండిగో రికార్డ్ ఆర్డర్.. ఎయిర్‌బస్ నుంచి 500 విమానాల కొనుగోలు.. డెలివరీ ఎప్పుడంటే..?
4. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
5.గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన యోగా దినోత్సవంలో 1.53 లక్షల మంది యోగాలో పాల్గొన్న సందర్బంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది.
6. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను సందర్శించారు
7. వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే - June 22
☛ Daily Current Affairs in short : 21 జూన్ 2023 కరెంట్ అఫైర్స్ ఇవే