Skip to main content

Daily Current Affairs in short : 21 జూన్‌ 2023 కరెంట్‌ అఫైర్స్‌ ఇవే

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యు్కేష‌న్ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌

➤   అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో సిక్కులు పఠించే పవిత్ర శ్లోకం గుర్బానీ ప్రసార హక్కులు ఉచితంగా ప్రసారం చేసేలా పంజాబ్‌ ప్రభుత్వం సిక్కు గురుద్వార చట్టం– 1925 సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది.

➤   జీ–20 నాలుగవ టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సును కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించారు.
➤   భర్త శారీరక సంబంధాన్ని కలిగి ఉండకపోవడం హిందు వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయిన ఐపీసీ సెక్షన్‌ 498 అ ప్రకారం అది నేరం కాదని కర్ణాటక హైకోర్టు తెలిపింది.

➤   విశ్వ విద్యాలయాలకు ఛాన్స్‌లర్‌గా గవర్నర్‌కు బదులుగా ముఖ్యమంత్రి ఉండాలని, డీజీపీ ఎంపికలో యూపీయస్సీ పాత్ర లేకుండా రాష్ట్ర ప్ర‌భుత్వమే నియమించేల పంజాబ్‌ శాసన సభ రెండు బిల్లులను ఆమోదించింది

➤  భూమి ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల లోపు పరిమితం చేయకపోతే హిందూ కుష్‌లోని మంచు 80 శాతం మేర కరిగిపోవచ్చునని ఖాట్మండులోని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ది కేంద్రం తెలిపింది. హిందూ కుష్‌ పర్వత శ్రేణితో భారత్, పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్, భూటాన్, చైనా, బాంగ్లాదేశ్, మియన్మార్‌ దేశాలు ఉన్నాయి.

➤  పాకిస్తాన్‌లోని మియాన్‌వాలీ జిల్లాలో చష్మా–వి అనే 1200 మెగావాట్ల అణు విద్యుత్‌ కేంద్రాన్ని చైనా నిర్మిస్తున్నది.

Nuclear Power Plant: పాక్‌లో అణు విద్యుత్కేంద్రం ఏర్పాటుకు చైనా సాయం

➤  1950-2021 ల మధ్య జననరేటు తక్కువగా ఉన్న దేశం – దక్షిణ కొరియ(86 %)

➤   అంతర్జాతీయ యోగా దినోత్సవం – june 21

➤   అంతర్జాతీయ యోగా థీమ్‌ 2023– వసుదైవ కుటుంబానికి యోగా.

Inspiring Yoga Gurus: యోగానంద నుంచి అయ్యంగార్‌ వరకూ.. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిన ‍ప్రముఖ గురువులు వీరే..

➤   ఔషద ఎగుమతుల్లో భారత్‌ 23–24 లలో 10 శాతం వృద్దితో 2.3 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. ఉదయ భాస్కర్‌ తెలిపారు.

➤   జూనియర్‌ స్పీడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను సొంతం చేసుకున్న గుకేష్‌. 

➤  స్వలింగ వివాహాలను చట్టబద్దం చేసిన మధ్యయూరోపియన్‌ దేశం ఎస్టోనియా. 

➤  సంవత్సరంలో సూర్యుడు ఎక్కువగా ఉండే రోజు– june 21

➤  జర్మన్‌ బుక్‌ ట్రేడ్‌ శాంతి బహుమతి 2023  రచయిత సల్మాన్‌ రష్దీకి లభించింది.

20th June, 2023 Current Affairs

 

Published date : 21 Jun 2023 05:06PM

Photo Stories