Nuclear Power Plant: పాక్‌లో అణు విద్యుత్కేంద్రం ఏర్పాటుకు చైనా సాయం
Sakshi Education
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్‌లో రూ.39 వేల కోట్లతో 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చైనా ముందుకు వచ్చింది.
పాకిస్తాన్–చైనాల వ్యూహాత్మక మైత్రి బలోపేతం అవుతోందనేందుకు మరో ఉదాహరణ. పంజాబ్‌లోని మియాన్‌వలి జిల్లా చస్మా వద్ద చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో జూన్ 20న బీజింగ్‌లో రెండు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే ప్రారంభిస్తామని షరీఫ్ ప్రకటించారు.
Tall Buildings: ఎత్తయిన భవన నిర్మాణాలకు బ్రేక్.. ప్రజలకి తగ్గిన మోజు..
Published date : 21 Jun 2023 12:10PM