Skip to main content

Daily Current Affairs in Telugu: 26 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
 Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu
  1.  భర్త సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకూ సమాన వాటా ఉంటుందని మద్రాసు హైకోర్టు  జస్టిస్‌ రామసామి  తీర్పును వెలువరించారు.
  2. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ భాగంగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సంద‌ర్బంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లను త్రిపుర రాష్ట్రంలోని 75 సరిహద్దు గ్రామాలకు పెట్టాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది.
  3. ‘విదేశాలకు వెళ్లే హక్కు, విలువైన ప్రాథమిక హక్కు వ్యాపారవేత్త రమణ్‌సేథీ కేసులో దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
  4. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి ఆహ్వనం మేరకు ఈజిప్టు దేశ పర్యటనకు వెళ్లిన‌ ప్రధాని మోదీ ఈజిప్టులోని 11వ శతాబ్దపు చరిత్రాత్మక అల్-హకీమ్ మసీదు, కైరోలోని హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ స్మారకాన్ని, కైరో నగర శివారులో ఉన్న గిజా పిరమిడ్‌ను ప్రధాని మోదీ సందర్శించారు.
  5. ఈజిప్టు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఈజిప్టు అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌తో' ఈజిప్టు దేశ అధ్యక్షుడైన అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసి  ప్రధాని మోదీని స‌త్క‌రించారు

Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

      6. గాడిద 12 నెలలు,జిరాఫీ 13 నుంచి 16 నెలలు, ఖడ్గమృగం 15 నుంచి 16 నెలలు, తెల్ల ఖడ్గమృగాలు 16            నుంచి 18 నెలలు,ఏనుగు 680 రోజులు గర్భాన్ని మోసి, పిల్లల‌కు జన్మనిస్తుంది.

     7. ఆక్టోపస్‌ సముద్ర జీవికి 3 గుండెలు, 8 కాళ్లు ఉంటాయి. దీని రక్తం నీలి రంగులో ఉంటుంది. దీని జీవిత               కాలం 6 నెలలు మాత్రమే, స్క్విడ్ చేపకు 3 గుండెలు ఉంటాయి. దీనిలో ఒక గుండె దాని శరీరానికంతటికీ           రక్తం సరఫరా చేస్తుంది. మిగిలిన రెండు గుండెలు గిల్స్‌లో ఆక్సిజన్‌ పంప్‌ చేస్తాయి. గిల్స్‌ అనేది చేపకు             ఆక్సిజన్‌ అందించే అవయవం.కాక్రోచ్‌కు ఒకే గుండె ఉన్నప్పటికీ దానికి 13 చాంబర్లు ఉంటాయి. దీని                 గుండెలోని ఒక చాంబర్‌కు గాయమైతే, మిగిలిన చాంబర్లు యాక్టివేట్‌ అవుతాయి.

     8. ప్రపంచవ్యాప్తంగా 6,500కు పైగా భాషలు వాడుకలో ఉండగా, పపువా న్యూ గినియా 840 భాషలతో మొద‌టి            స్థానంలో ఉండ‌గా, పపువా న్యూ గినియా ఇండోనేసియా 710 భాషలతో రెండో స్థానంలో, జీరియా 524                    భాషలతో మూడో స్థానంలో, భారత్‌ 453 భాషలతో 4వ స్థానంలో నిలిచాయి. ఇక, 337 భాషలతో అమెరికా                ఐదో  స్థానంలో, 317 భాషలతో ఆస్ట్రేలియా ఆరో స్థానం ఉండగా, 307 భాషలతో చైనా ఏడో స్థానంలో                      కొనసాగుతోంది. 

    9. ప్ర‌పంచ వ్యాప్తంగా 67 దేశాల్లో ఇంగ్లిష్, 29 దేశాల్లో ఫ్రెంచ్, 27 దేశాల్లో అరబిక్, 21 దేశాల్లో స్పానిష్, 10                 దేశాల్లో పోర్చుగీస్, 6 దేశాల్లో జర్మన్, 4 దేశాల్లో రష్యన్‌ భాషను మాట్లాడుతున్నారు.

  10. సుతీర్థ ముఖర్జీ–ఐహిక ముఖర్జీ జోడీ మహిళల డబుల్స్ వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌               టోర్నీలో టైటిల్ కైవ‌సం చేసుకుంది. 

Daily Current Affairs In Telugu: 23 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్...

  11. క్వీన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ విజేతగా నిలిచాడు.

  12. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ తొలి సీజన్‌లో మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ జట్టు,  ఉత్తరప్రదేశ్‌ జట్టుపై గెలిచి                    విజేతగా నిలిచింది.   

  13. భారతదేశంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో సాంకేతిక విద్యను పెంపొందించేందుకు                  ప్రపంచ బ్యాంకు USD 255.5 మిలియన్ రుణాన్ని ఇవ్వ‌డానికి ఆమోదం తెలిపింది.

  14. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బలిదాన్ స్తంభం నిర్మాణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా                                ప్రారంభించారు.

  15. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ (IMD) ప్రక‌టించిన గ్లోబల్                                  కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్-2023కి గాను 64 దేశాలలో డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌ దేశాలు మొదటి                  మూడు స్థానాల‌లో ఉన్నాయి.భార‌త్ కి 40వ స్థానం ద‌క్కింది.

  16. అంత‌ర్జాతీయ మార‌క ద్ర‌వ్యాల దినోత్స‌వం- June 26

Daily Current Affairs Short: 22 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్ ఇవే..

 

Published date : 28 Jun 2023 06:25PM

Photo Stories