Daily Current Affairs in Telugu: 30 జూన్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో మూడో స్థానంలోను, ఉపాధి కల్పించడంలో రెండో స్థానంలోను నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2. రాష్ట్ర తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఇన్‌ఛార్జి అధ్యక్షుడిగా పి.విజయబాబును, రాష్ట్ర యువజనాభ్యుదయం, పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ నియమించారు.
3. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులోని జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం జూన్ 27న తొలిసారిగా ఓ భూ వివాదానికి సంబంధించి దాఖలైన అప్పీల్ తీర్పును తెలుగు భాషలో వెలువడించింది.
☛ Daily Current Affairs in Telugu: 29 జూన్ 2023 కరెంట్ అఫైర్స్
4.వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లకు చెందిన షేక్ దర్వేష్ సాహెబ్ కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
5. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
6. అంతర్జాతీయ పార్లమెంటరీ విధాన దినోత్సవం- June 30.