Skip to main content

Daily Current Affairs in Telugu: 4 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌
Daily Current Affairs
Daily Current Affairs


1. అత్యవసర వైద్య సేవ­లను మరింత బలోపేతం చేయడంలో భాగంగా 146 కొత్త 108 వాహనాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్  ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉన్నాయి.

2. సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ ఇంటర్‌మీడియ‌ట్‌ కాన్ఫిగరేషన్‌ పరీక్ష (పవర్‌ హెడ్‌ టెస్ట్ ఆర్టిక‌ల్‌)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి వద్ద ఇస్రో ప్రపొల్షన్‌ కాంప్లెక్స్‌ (ఐపీఆర్‌సీ) సెంటర్‌లో జులై  1న మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.

3. జాతీయ సీనియర్‌ అక్వాటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి వ్రితి అగర్వాల్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌ రేసులో కాంస్య పతకం సాధించింది. 

4. ఫారిన్ ట్రేడ్ పాలసీ (FTP) 2023లో భాగంగా భారత్‌, మలేషియా మధ్య జ‌రిగే వాణిజ్యం భారతీయ రూపాయి (INR)లో నిర్వహిస్తామ‌ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

5.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 68వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశంలోని 21 జిల్లా కేంద్రాల్లో 34 ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ హబ్‌లను ప్రారంభించింది.

 Daily Current Affairs in Telugu: 1 జులై 2023 క‌రెంట్ అఫైర్స్

6. గుజరాత్‌లోని కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ (KAPP)లో భారత్‌లో  మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన 700 MW న్యూక్లియర్ పవర్ రియాక్టర్లో విజయవంతంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది.

7. వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్ సైనిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

8. మిషన్ కర్మయోగి అమృత్ కాల్ ప్రాధాన్యతల కోసం అధికారులకు శిక్షణ ఇవ్వడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్తమంగా ఉపయోగించడంతో ఆత్మనిర్భర్ భారత్ తయారీకి సహకరించేలా వారిని సన్నద్ధం చేయడం అని  సైన్స్ & టెక్నాలజీ,పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ,స్పేస్ కేంద్ర రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక కార్య‌క్ర‌మంలో తెలిపారు.

9. న్యూఢిల్లీలో జరిగిన నాడా ఇండియా - సరడో సహకార సమావేశంలో బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంకలకు చెందిన యాంటీ-డోపింగ్ ఆర్గనైజేషన్లతో క్రీడల‌లో యాంటీ డోపింగ్‌లో ప్రాంతీయ సహకారాన్ని పెంచడం కోసం NADA ఇండియా- SARADOతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది.

Daily Current Affairs in Telugu: 30 జూన్ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 04 Jul 2023 02:59PM

Photo Stories