Skip to main content

Kepler Planets: నీటి గ్రహాలు.. భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవి!

భూమికి 218 కాంతి సంవత్సరాల దూరంలోని లైరా అనే పాలపుంతలో ఓ ఎర్రని మరుగుజ్జు తార చుట్టూ పరిభ్రమిస్తున్న కెప్లర్‌–138సి, కెప్లర్‌–138డి అనే రెండు గ్రహాలను సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు.

ఇందులో వింతేముందంటారా? పరిమాణంలో భూమి కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవైన ఇవి రెండూ దాదాపుగా నీటితో నిండి ఉన్నాయట! నాసా కెప్లర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ వీటి ఉనికిని బయట పెట్టింది. వాటిపై ఉన్న పదార్థం శిలల కంటే తేలికగా, హైడ్రోజన్, హీలియం కంటే భారంగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. కనుక అది కచ్చితంగా నీరే అయి ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. విశ్వంలో ఇలాంటి నీటి గ్రహాల ఉనికి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి! దీనికి సంబంధించి నేచర్‌ ఆ్రస్టానమీ జర్నల్‌లో లోతైన అధ్యయనం పబ్లిషైంది. 

Current Affairs (Science & Technology) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 21 Dec 2022 01:31PM

Photo Stories