Voyager–1 Spacecraft: 2,400 కోట్ల కి.మీ. దూరంలో వోయేజర్-1.. 43 ఏళ్ల తర్వాత నాసా..
స్పేస్‌క్రాఫ్ట్ 47 సంవత్సరాల తర్వాత తిరిగి కాంటాక్ట్‌లోకి రానుంది. సాంకేతిక కారణాలతో 1981 నుంచి మూగబోయింది. రేడియో ట్రాన్స్‌మిట్టర్‌లో విద్యుత్ నిండుకోవడంతో సంకేతాలు పూర్తిగా నిలిచిపోయాయి.
భూమి నుంచి ప్రస్తుతం ఏకంగా 2,400 కోట్ల కిలోమీటర్ల(1500 కోట్ల మైళ్ల) దూరంలో ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో ఉన్న వోయేజర్–1 రేడియో ట్రాన్స్‌మిట్టర్‌కు మళ్లీ జీవం పోసే పనిలో నాసా సైంటిస్టులు నిమగ్నమయ్యారు.
ఆ దిశగా తాజాగా స్వల్ప పురోగతి సాధించారు. దాంతో ఈ వ్యోమనౌక 43 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ నాసాతో అనుసంధానమైంది. వోయేజర్–1ను క్రియాశీలకంగా మార్చడంలో భాగంగా దాని హీటర్లు పని చేసేలా డీప్ స్పేస్ నెట్‌వర్క్ ద్వారా అక్టోబర్ 16న కమాండ్స్ పంపించారు. ఈ ప్రయత్నాలు ఫలించాయి.
Ballistic Missile: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణి పరీక్ష..
అక్టోబర్ 18న వోయేజర్–1 స్పందించింది. అది పంపిన సందేశం 23 గంటల తర్వాత భూమికి అందింది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి ఈ సందేశం తోడ్పడుతుందని భావిస్తున్నారు.
వోయేజర్-1లో రెండు రేడియో ట్రాన్స్‌మిటర్లు ఉన్నాయని, ఎక్స్ బ్యాండ్ ట్రాన్స్‌మిటర్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నారని, అయితే ఎస్ బ్యాండ్ ట్రాన్స్‌మిటర్ తాజాగా ఆన్ అయినట్లు కనుగొన్నారు. వోయేజర్-1 ప్రస్తుతం హీలియోస్పియర్‌ను దాటేసింది. ఇది అనేక ఆసక్తికరమైన పరిశోధనలకు మార్గం సృష్టిస్తుంది.
Shenzhou 19 Mission: ‘డ్రీమ్’ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన చైనా