Aditya L1 MIssion Time and Date Fix: ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి తేది సమయం ఖరారు
సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. ఆదిత్య ఎల్-1పై ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఇక, ఆదిత్య ఎల్-1 సూర్యుడిపై అధ్యయనం చేయనున్న విషయం తెలిసిందే.
Aditya L1 Mission: సెప్టెంబర్ 2న ఆదిత్య–ఎల్1
సూర్యుడి కరోనాపై పరిశోధనలు..
చంద్రయాన్-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇస్రో మరన్ని ప్రయోగాలకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్ ద్వారా సూర్యుడి కరోనాపై పరిశోధనలు జరుపనుంది. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది.
High temperature on Moon: చంద్రుడిపై అధిక ఉష్ణోగ్రతలు
ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టి.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నది. ఇందు కోసం ఆదిత్య ఎల్-1 ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తోంది. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA), పుణె ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఈ మిషన్ కోసం పేలోడ్స్‌ను అభివృద్ధి చేశాయి.