Aditya L1 Mission: సూర్యుని ఫుల్ డిస్క్ ఇమేజీలను పంపిన ఆదిత్యఎల్1
తొలిసారిగా సూర్యుని ఫుల్ డిస్క్ ఇమేజీలను భూమికి పంపింది. ఉపగ్రహంలోని సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (సూట్) విజయవంతంగా ఈ ఫొటోలు తీసినట్టు ఇస్రో శుక్రవారం పేర్కొంది. వాటిని తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఫొటోలను 200–400 ఎన్‌ఎం తరంగదైర్ఘ్య పరిధిలో తీసినట్టు వెల్లడించింది.
Aditya-L1 Mission: సౌర గాలులను ఆధ్యయనం చేస్తున్న ఆదిత్య ఎల్–1
ఈ ఫొటోల్లో సూర్యుని తాలూకు ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లను 11 వేర్వేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య ఎల్1 బందించింది. ఆ స్పియర్లపై లోతైన సమాచారాన్ని ఈ ఫొటోలు అందించినట్టు ఇస్రో తెలిపింది. భూ వాతావరణంపై సౌర ధార్మికత ప్రభావం తదితరాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి తాజా ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. వాటిలో సూర్య వలయాల వంటివి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ISRO's AstroSat: అంతరిక్షంలో గామా కిరణ పేలుడును గుర్తించిన ఇస్రో ఆస్ట్రోశాట్