Skip to main content

Aditya L1 Mission: భారత తొలి సన్‌ మిషన్‌(ఆదిత్య ఎల్‌1)లో కీలక పరిణామం.. ఎప్పుడంటే..

సూర్యునిపై పరిశోధనలకు భారత్‌ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 వ్యోమనౌక జనవరి 6వ తేదీ(శనివారం) ఉదయం నిర్దేశించిన కక్ష్యలోకి చేరనుంది.
Space Exploration Success  Solar Probe's Successful Journey: From Sriharikota to Lagrangian Point  ISRO's Aditya L1 Mission Will Reach Destination On January 6 2024    Aditya L1's Historic Orbit Achievement

ఇక్కడికి చేరిన తర్వాత ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆదిత్య ఎల్‌1 నిరంతరం సూర్యునిపై అధ్యయనం చేయగలుగుతుంది. సెప్టెంబర్‌ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఆదిత్య ఎల్‌1 నాలుగు దశలు దాటి ఇప్పటికే భూమికి, సూర్యునికి మధ్యలో ఉన్న లాగ్రాంజియన్‌ పాయింట్‌కు చేరుకుంది. అయితే జనవరి 6న‌ మరో 63 నిమిషాల 20 సెకన్లు ప్రయాణించి నిర్దేశిత క‌క్ష్యలోకి చేరుతుంది. లాంగ్రాంజియన్‌ పాయింట్‌లో భూమి, సూర్యుని గురత్వాకర్షణ శక్తి బలాలు ఒకదానికొకటి క్యాంసిల్‌ అయి దాదాపు జీరో స్థితికి చేరుకుంటాయి.

అంటే ఇక్కడ గ్రావిటీ ఉండదు. దీంతో సూర్యుని చుట్టూ తిరిగేందుకుగాను ఈ పాయింట్‌లో ఉన్న వ్యోమనౌకలకు పెద్దగా ఇంధనం అవసరం ఉండదు. ఈ కారణం వల్లే పరిశోధనలకు ఎల్‌1 పాయింట్‌ అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య ఎల్‌1లో ఏడు సైంటిఫిక్‌ పేలోడ్‌లు ఉంటాయి. సూర్యునిపై ఉండే ఫొటోస్పియర్‌, క్రోమో స్పియర్‌, కరోనా పొరలను మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్‌ల సాయంతో ఏడు పేలోడ్‌లు నిరంతరం అధ్యయనం చేసి డేటాను భూమికి పంపిస్తుంటాయి.  

ISRO’s XPoSat Launch: కొత్త సంవ‌త్స‌రం తొలిరోజే నింగిలోకి ఎగసిన ఎక్స్‌పోశాట్..

Published date : 05 Jan 2024 12:23PM

Photo Stories