Skip to main content

Aditya L1 Mission: సెప్టెంబర్‌ 2న ఆదిత్య–ఎల్‌1

భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది.
Aditya L1 Mission
Aditya L1 Mission

సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్‌1 ప్రయోగం సెప్టెంబర్‌ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రయోగం విశేషాలివే..

NASA-ISRO SAR Mission:ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం

  • భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్‌ పాయింట్‌–1 (ఎల్‌1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
  • భూమి నుంచి లాంగ్రేజియన్‌ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది
  • లాంగ్రేజియన్‌1 పాయింట్‌లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు.
  • ఆదిత్య ఎల్‌–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు
  • సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది,  అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్‌1 అధ్యయనం చేస్తుంది.  ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్‌ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్‌ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది.
  • మొత్తం ఏడు పేలోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ పేలోడ్‌ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.

Rover Started Research on Moon: చంద్రుడిపై అధ్యయనం మొదలుపెట్టిన‌ ప్రగ్యాన్‌

Published date : 28 Aug 2023 12:38PM

Photo Stories