Skip to main content

NASA-ISRO SAR Mission:ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం

చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది.
NASA-ISRO SAR Mission
NASA-ISRO SAR Mission

ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ  నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. 

Rover Started Research on Moon: చంద్రుడిపై అధ్యయనం మొదలుపెట్టిన‌ ప్రగ్యాన్‌

ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది.

Chandrayaan-3: జయహో భారత్‌... చంద్ర‌య‌న్‌-3 ప్ర‌యోగం సూప‌ర్ స‌క్సెస్‌

NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్‌లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్‌స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి.  
SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్‌లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా.  

Russia Luna 25 Crashes: రష్యా లూనా-25 ప్రయోగం విఫలం

Published date : 26 Aug 2023 03:46PM

Photo Stories