Russia Luna 25 Crashes: రష్యా లూనా-25 ప్రయోగం విఫలం
చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం ఆగస్టు 10న వోస్తోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి రష్యా ప్రయోగించిన లూనా -25లో ఆగస్టు 19న సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడిపై కుప్పకూలింది. చంద్రుడికి సమీపంగా వెళ్లిన తర్వాత నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టే ముందు ఈ సమస్య తలెత్తినట్లు తెలిపింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ నెల 21న ఇది చంద్రుడిపై కాలు మోపాల్సి ఉండగా అంతలోనే ఇలా జరగడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రష్యా శాస్త్రవేత్తలు.
Chandrayaan-3: చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్–3
రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ దాదాపు 50 ఏళ్ల విరామం తరువాత చంద్రుడిపై పరిశోధనల కోసం లూనా -25ని ప్రయోగించింది. కేవలం 11 రోజుల్లోనే చంద్రుడిపై దిగేందుకు చేసిన ఈ ప్రయోగంపై రష్యా మొదటి నుంచి చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. కానీ చివరి నిముషంలో క్రాష్ ల్యాడింగ్ జరగడం దురదృష్టకరమంటోంది రోస్ కాస్మోస్.