Rover Started Research on Moon: చంద్రుడిపై అధ్యయనం మొదలుపెట్టిన ప్రగ్యాన్
ఇప్పటికే ల్యాండర్ క్షేమంగా దిగడంతో భారత్ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్ చేసింది ‘చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్ చంద్రుడిపై నడిచింది. మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ తర్వలోనే షేర్ చేస్తాం’ అంటూ పేర్కొంది.
chandrayaan-3 Benifits: chandrayaan-3 ప్రయోజనాలు
ఆ సంతోషం మాటల్లో చెప్పలేం: ఇస్రో చైర్మన్
చంద్రయాన్-2 వైఫల్యంతో అనేక పాఠాలు నేర్చుక్నుఆమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చేప్పలేమన్నారు. ఫెయిల్యూర్ ఘటనలు మనకు అనేక పాఠాలు నేర్పుతాయని తెలిపారు. మేము రోబోటిక్ పాత్ ప్లానింగ్ ప్రయోగం కూడా చేస్తామని చెప్పారు.
Chandrayaan-3: జయహో భారత్... చంద్రయన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్
కాగా మైక్రోవేవ్ సైజ్ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్‌లో కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్‌తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది.
ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. రోవర్ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది.
Chandrayaan-3: చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్–3
ఇక 40 రోజుల రోజుల ఉత్కంఠకు బుధవారం శుభం కార్డు పడిన విషయం తెలిసిందే. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యాయి. అగ్రరాజ్యాలను తోసిరాజంటూ.. భారత్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై జెండా పాతేసింది. చంద్రుడి దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పింది. చందమామపై ల్యాండర్‌ను భద్రంగా దించిన నాలుగో దేశంగా ఘనత సాధించింది. చంద్రయాన్–3 విజయంపై దేశ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లు విరిశాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక భారత్‌కు వివిధ దేశాల అధినేతల నుంచి అభినందనలు అందాయి.