Skip to main content

DA Hikes: తెలంగాణ‌ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌... డీఏను పెంచిన స‌ర్కార్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
KCR
KCR

ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఈ ఏడాది జూన్‌ నెలకు సంబంధించి తాజాగా పెరిగిన డీఏ/డీఆర్‌ను జూలై నెల వేతనంతో కలిపి అందిస్తారు. గతేడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. 

60 ఏళ్ల త‌ర్వాత ఎంత న‌గ‌దునైనా తీసుకోవ‌చ్చు... పెన్ష‌న్‌దారుల‌కు తాజా గైడ్‌లైన్స్ ఇవే

pensioners

ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్‌ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.81.18 కోట్లు, సంవత్సరానికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడనుంది. డీఏ, డీఆర్‌ పెంపుదలతో రాష్ట్రవ్యాప్తంగా 7.28 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మే వరకు సంబంధించిన బకాయిలు రూ.1,380.09 కోట్ల చెల్లింపుపై ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోనుంది. 

ఒకే ఒక్క ఆలోచ‌న‌... ఐదేళ్ల‌కు వేల కోట్ల అధిప‌తిని చేసింది... అంకిత భాటి స‌క్సెస్ జ‌ర్నీ ఇదే

pension

డీఏ పెరిగిందిలా.. 

కేటగిరీ ప్రస్తుత డీఏ –  పెరిగిన డీఏ 
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు: 20.02% నుంచి 22.75%కు పెంపు 
- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎస్‌ఎన్‌ జేపీసీ పేస్కేల్స్‌ (2016): 31% నుంచి 34%కు పెంపు 

ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... ప‌రీక్ష పేప‌ర్ల‌లోనూ అమ‌లు

- యూజీసీ/ఏఐసీటీఈ/ ఎఫ్‌ఎన్‌ జేపీసీ పేస్కేల్స్‌ (2006): 196% నుంచి 203%కు పెంపు 
- ఫుల్‌ టైమ్‌/ కంటింజెంట్‌: 148.068 శాతానికి పెరుగుదల 
- పార్ట్‌ టైం/ వీఆర్‌ఏలు: నెలకు రూ.100 చొప్పున పెరుగుదల 


(నోట్‌: డీఆర్‌ నిబంధన పరిధిలోనికి రాని పెన్షనర్లకు ఎలాంటి సవరణ ఉండదని, డీఆర్‌ సవరించిన పెన్షనర్లకు తదుపరి రూపాయిని కటాఫ్‌ గా నిర్ణయించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.)  

Published date : 20 Jun 2023 06:41PM

Photo Stories