Skip to main content

Jagananna Vidya Kanuka: పేద పిల్ల‌లకు ట్యాబులు ఇచ్చాం... పాఠ‌శాల విద్య‌లో పెద్ద ఎత్తున సంస్క‌ర‌ణ‌లు తెస్తున్నాం: సీఎం వైఎస్ జ‌గ‌న్‌

పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్‌. సోమవారం పల్నాడు క్రోసూర్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్‌ ఏకిపారేశారు.
CM YS Jagan
CM YS Jagan

‘‘చంద్రబాబుకు మంచి చేయాలన్నది ఏనాడూ లేదు. గతంలో ఇది చూశాం. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా.. ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదకులండా ‘‘ఎన్నికలకు ముందు వాగ్ధానం చేశారు.. ఎన్నికల తర్వాత మోసం చేశాడ’’ని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమన్నారు. 

Half Day Schools: ఏపీలో నేటి నుంచి ఒంటి పూట బ‌డి

cm jagan

గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించండి. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది. అక్కచెల్లెమ్మల దగ్గరి నుంచి అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. కానీ, చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోటులు.  

cm jagan

ఒక ఈనాడు, ఒక టీవీ5, ఒక ఆంధ్రజ్యోతి, ఒక దత్తపుత్రులు.. ఈ గజదొంగల ముఠా ఆయనకు అండగా వస్తోంది. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్‌గా వండుతున్నారు. మనం చేసిన మంచిని, అందిస్తు‍న్న సంక్షేమ పథకాలను కిచిడీ, పులిహోరగా వండే ప్రయత్నం చేస్తున్నారు.  

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల డేట్ ఇదే... ఇంట‌ర్ మార్కుల‌కు వెయిటేజీ ఎంతంటే...

cm jagan

సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్‌లు అంటూ ఇవాళ మొదలుపెట్టారు. ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు? అంటూ నిలదీశారు సీఎం జగన్‌. కేవలం ఎన్నికలప్పుడే వాగ్ధానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు సీఎం జగన్‌. 

cm jagan

చంద్రబాబునాయుడుగారి పెత్తందారీ వ్యవస్థకు X పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి X  లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్‌కు జరుగుతున్న యుద్ధం. సామాజిక అన్యాయానికి X సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. యెల్లో మీడియా విష ప్రచారానికి X ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధం.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుద‌ల... ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

cm jagan

ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధం.. ఇది జగన్‌పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధం.  మీ జగనన్నకు ఈనాడు తోడు లేదు, టీవీ 5 అండ లేదు, ఏబీఎన్‌ ఢంకా బజాయించడంలేదు, దత్తపుత్రుడు అసలే లేడు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు.

Jagananna Vidya Kanuka: బ‌డిలో అడుగుపెట్ట‌గానే విద్యార్థుల‌కు... ‘జగనన్న విద్యా కానుక’

మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి.

cm jagan

మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. మీ అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని  కోరుకుంటున్నా.  

Published date : 12 Jun 2023 04:04PM

Photo Stories