Skip to main content

UPSC Civil Prelims Results 2023: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుద‌ల... ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

అఖిల భారత సర్వీసుల్లోని ఖాళీల‌ను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ 2023 పరీక్ష ఫలితాలు సోమవారం(జూన్ 12న‌) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
UPSC Civil Prelims Results 2023
UPSC Civil Prelims Results 2023

ఈ ఏడాది మే 28న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రీక్ష‌కు దాదాపు 10 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇందులో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరు ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. 

TSPSC Group 1 Prelims Question Paper With Key 2023: ముగిసిన ప్రిలిమ్స్ ప‌రీక్ష‌.. కీ కోసం క్లిక్ చేయండి

students

ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ - 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్‌ కటాఫ్‌, ఆన్సర్‌ కీని సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించ‌నున్నారు.

ముగిసిన ప్రిలిమ్స్ ప‌రీక్ష‌.. ప్ర‌శ్నాప‌త్రం కోసం క్లిక్ చేయండి.. ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

students

ఈ ఏడాది నిర్వ‌హించిన ప్రిలిమ్స్ ప‌రీక్ష‌... గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు అభిప్రాయ‌ప‌డ్డారు. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో దినపత్రికలు కచ్చితంగా చదివితే మాత్రమే జవాబులు రాయగలిగే ప్రశ్నలు ఎక్కువగా ఈ సారి వ‌చ్చాయి. ప్రాచీన చరిత్ర నుంచి ప్రశ్నలు వచ్చాయి. జాగ్రఫీలో ముఖ్యమైన ప్రాంతాలపై ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా వ‌చ్చింద‌ని అభ్య‌ర్థులు తెలిపారు. 

UPSC Civils Prelims Question Paper 1 With Key 2023 కోసం క్లిక్ చేయండి

students

ఏఏ విభాగాల నుంచి ఎన్ని ప్రశ్నలంటే...
పేపర్‌ 1 లో 100 ప్రశ్నలకు గానూ.. వర్తమాన వ్యవహారాలపై 11, ఆర్థికశాస్త్రం, సామాజికాభివృద్ధి 11, చరిత్ర-సంస్కృతి 12, రాజనీతిశాస్త్రం, పరిపాలన 17, పర్యావరణం 20, జాగ్రఫీ 15, జనరల్‌ నాలెడ్జ్‌పై 9, మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

ఫ‌లితాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి 

UPSC Civil Services-2022 Prelims Paper 2(CSAT) Question Paper కోసం క్లిక్ చేయండి

Published date : 12 Jun 2023 01:33PM

Photo Stories